శ్రీలంక రాజధాని కొలంబోలోని సైనిక ఆస్పత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా బయటకు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు బయటపడ్డ కిడ్నీ స్టోన్స్‌లలో ఈ రాయే పెద్దది. ఈ రాయి బరువు 801 గ్రాములు. పొడవు 13.37 సెంటీమీటర్లు. రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్లు, 2008లో పాకిస్తాన్‌లో 620 గ్రాముల బరువున్న కిడ్నీ స్టోన్స్‌లను బయటకు తీశారు.