కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఆమె తండ్రి, సోదరుడు, మామ కలిసి గొంతు కోసి హతమార్చారు. 17 ఏళ్ల నేత్రావతి అనే బాలిక దళిత కులానికి చెందిన యువకుడ్ని ప్రేమించిందనే కోపంతో గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తుమకూరు ఎస్పీ రాహుల్ కుమార్ షహపూర్వాద్ తెలిపారు.