చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ ‘పానీపూరీ’. రోడ్ల పక్కన ఏర్పాటు చేసే బండ్ల వద్ద లొట్టలేసుకుంటూ అందరూ పానీపూరీలు లాగించేస్తుంటారు. అయితే మనం ఇప్పటివరకు వెజ్ పానీపూరీను మాత్రమే చూసి ఉంటాము. కానీ పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ స్ట్రీట్ ఫుడ్ వెండర్ నాన్ వెజ్ పానీపూరీలు తీసుకొచ్చాడు. ఇందులో చికెన్, మటన్, రొయ్యలు, వేట్కీ ఫిష్ పానీపూరీ వెరైటీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మెను నెట్టింట వైరల్ అవుతోంది.