కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 'మనం ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం. టిడ్కో ఇళ్లు రూపాయికే ఇస్తామని చెప్పాం. గుడివాడలోనే హామీ ఇచ్చాం, నిజం చేసి చూపించాం. టిడ్కో ఇళ్లతో కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. 16,240 గృహాలు అంటే 40వేలకు పైగా జనాభా ఉన్నారు. ఒక్కొక్కరి ఇంటి స్థలం విలువ రూ.7లక్షలు. ఇళ్లు పూర్తయితే రూ. 10లక్షల ఆస్తి అవుతుంది' అని అన్నారు.