చిలకలూరిపేట పట్టణం పండరీపురం లోని బీఆర్ఐజీ మున్సిపల్ హైస్కూల్ నందు శుక్రవారం జగనన్న విద్యాకానుక ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా, ఒక జత బూట్లు, 2జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ. విద్యార్థులకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని, మాజీ సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మ స్వాములు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. గోవిందరావు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను అందించారు. ఈ కార్యక్రమంలో పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, స్కూల్ చైర్మన్ టి సుజాత, స్కూల్ వైస్ చైర్మన్ రాము నాయక్, 36 వార్డు ఇన్చార్జి శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.