ప్రజా సమస్యలపై వీరమహిళలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్‌హాలులో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వీరమహిళలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన తీరు, వారి ఆకాంక్షలను పవన్‌కల్యాణ్ అడిగి తెలుసుకున్నా రు. జనసేన. పార్టీకి వీరమహిళల బలం ఎంతో విలువైందని పవన్ చెప్పారు. మహిళా సంక్షేమానికి, భద్రతకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదని, పోరాటం, ప్రజల తరపున గళమెత్తడమే ముఖ్యమని తెలిపారు. గొప్ప ఆశయం కోసం మీరు ముందుండి నడిచారని, అందరికి అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ ఆశయాలు, విదానాలు మద్యతరగతికి అనుగుణంగా ఉంటాయని ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్లకు రక్షణ కల్పించడానికి జనసేన అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న మహిళలకు జనసేన ప్రభుత్వంలో తప్పనిసరిగా దారి చూపిస్తామని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జనసేన తరపున వార్డు మెంబరుగా పోటీ చేశానని, వైసీపీ గూండాలు తన ఇంటికి రెండుసార్లు వచ్చి దళిత మహిళనని చూడకుండా దాడి చేశారని, కుమారుడిని చంపివేస్తామని బెదిరించారని, అయినా వెనక్కి తగ్గకుండా పోటీలో నిలబడి వైసీపీ అభ్యర్థిపై 45 ఓట్ల మెజార్టీతో గెలిచానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరం పంచాయతీకి చెందిన కె.సూర్యకుమారి తెలిపారు. ఇటువంటి తెగువ అందరికీ ఆదర్శమని పవన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa