గొలుగుండ మండలంలోని పాతమల్లంపేట పంచాయతీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం పర్యటించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం బడ్డాడపాడు, చంద్రయ్య పాలెం, కొత్తపాలెం, ధారపాలెం, పాతమల్లంపేటలో ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వివరించి, ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.