ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 476 మంది నైట్ వాచ్మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 476 కాలేజీల్లో ఈ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వీరికి నెలకు రూ. 6,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని, ఇందుకోసం ఇంటర్ విద్యామండలి నిధుల నుంచి వాడుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో 5,388 మంది నైట్ వాచ్మెన్లను నియమించారు.