అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని టోర్నడో మరోసారి వణికించింది. పెర్రీటన్లో సంభవించిన టోర్నడో ధాటికి ముగ్గురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇళ్లు, 30 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెక్సస్తో పాటు పొరుగు రాష్ట్రం ఒక్లహామాలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇరు రాష్ట్రాల్లో 50 వేలమంది రాత్రంతా చీకట్లోనే గడిపారు. ఇళ్ల శిథిలాల కింద ఉన్నవారిని ఫైర్ ఫైటర్లు వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.