అమెరికా ఫెడరల్ జడ్జిగా మొదటి ముస్లిం మహిళ అయిన నుస్రత్ జహాన్ చౌదరి(46) నామినేషన్‌ను యూఎస్ సెనేట్ ఆమోదించింది. ఆమె అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU)కి మాజీ న్యాయవాది. ఈ జీవితకాల పదవిని కలిగి ఉన్న మొదటి బంగ్లాదేశ్ అమెరికన్ కూడా చౌదరినే. న్యూయార్క్ తూర్పు జిల్లాకు UFS కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. 50-49 నిర్ణయంతో ఫెడరల్ న్యాయమూర్తిగా ఆమె నియామకాన్ని పార్లమెంట్ ఆమోదించింది.