గుంటూరు జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న 452 మంది పాత్రికేయులకు మొదటి జాబితాలో అక్రిడిటేషన్లు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి ఈ అక్రిడిటేషన్ వర్తిస్తుందన్నారు.