చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామ శివారులో ఉప్పాల అమర్నాథ్ (15) అనే యువకుడి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రదేశాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నామని నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.