వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెనాలి సీఐ చంద్రశేఖర్, ఎస్బీ ఉమామహేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తెనాలి పట్టణం నాజరుపేటలోని ఓ ఇంటిపై శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాడేపల్లికి చెందిన వ్యభిచార నిర్వాహకుడు షేక్ గపూర్ ను అదుపులోకి తీసుకుని ఇద్దరు మహిళలను కాపాడారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa