ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బి, రెండు సంవత్సరాల మహమ్మద్ అమన్ కనిపించటం లేదని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఇమామ్ శుక్రవారం తెలిపారు. గ్రామంలోని ముస్లిం కాలనీకి చెందిన షేక్ మస్తాన్ బి గత నెల 30వ తేదీన కూలీ పనులకు వెళ్లి వచ్చేసరికి కనిపించకుండా పోయింది. అయితే వారిద్దరి ఆచూకి లభించకపోవటంతో భర్త గుడిపాటి నాగులు పోలీసులను ఆశ్రయించాడు.