గుంటూరు జిల్లాలో ఉపాధి పనులను నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ఎంపిడిఒలు, ఎపిఒలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, జలజీవన్ మిషన్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణంపై శుక్రవారం కలక్టరేట్ లో సమీక్షించారు. జాబ్ కార్డు వున్న వారికి వంద రోజులు పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పనుల నిర్వహణలో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.