పవన్ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని, గంటకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తన యజమాని చంద్రబాబు మెప్పు కోసం పవన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పెట్టిన రెండు మీటింగ్‌లు అట్టర్ ప్లాప్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇండిపెండెంట్‌గా చాలా మంది గెలిచారని, పార్టీ పెట్టి కూడా పవన్ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదన్నారు.