ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వారిద్దరూ. ఇద్దరి సంపదలో స్వల్ప తేడా.. భారీ పోటీ. ఎవరంటే ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు. తమ కుటుంబ సభ్యులతో పాటు ఫ్రాన్స్ లోని పారిస్ లో మీట్ అయ్యారు. ఇప్పుడీ వార్త ప్రపంచ వ్యాపార వర్గాల్లో ఓ సంచలనం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.