దేశ ప్రజలకు ఆదిపురుష్ చిత్రబృందం క్షమాపణ చెప్పాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణ ఉందని, ఆదిపురుష్ టీమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.