ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైరయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క కిలోమీటర్ కూడా రోడ్డు వేయలేదని విమర్శించారు. ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, రాష్ట్రంలో 3 కోట్ల మందికి బీజేపీ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, మా పొత్తు జనంతోనే అని అన్నారు.