ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలువురికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 13 లక్షల 35 వేల రూపాయలను శనివారం ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గుంటూరు కార్యాలయంలో అందజేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది అందించటం జరిగిందని నగదును సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.