బర్మాక్యాంపు ఏఎస్సాఆర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు అదృశ్యమయింది. ఏఎస్సాఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కర్రి సూర్యకుమారి వద్ద ఆమె తల్లి కర్రి ఆదిలక్ష్మి (66) ఉంటోంది. ఈ నెల 14న ఆదిలక్ష్మి తనకు ఒంట్లో నలతగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నా నని బయటకు వెళ్లింది. ఆ తర్వాత సాయంత్ర మైనా ఇంటికి చేరుకోక పోవడంతో రోజులు గడుస్తున్న ఆమే ఇంటికి చేరుకొక పోవడంతో చేసేది లేక ఆమే కుటుంబ సభ్యులు శనివారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి తన తల్లి రాజమండ్రి వెళతానని అంటుంటే తాము వద్దని వారించామని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కూతురు పేర్కొంది. సీఐ విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.