జీవీఎంసీ 13వ వార్డు పరిధిలో శ్రీకృష్ణ పురం గురుకుల పాఠశాలలో 2022-2023 పదో తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జగనన్న ఆణిముత్యాలు పేరిట వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత గారు చేతుల మీదుగా పాఠశాలలో ప్రథమ స్థానం పొందిన దేముడు బాబు(516)3,000 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన తరుణ్ శ్రీదేవ్(498)2000రూపాయలు, తృతీయ స్థానం పొందిన ప్రసాద్(488)1000రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, నాడు-నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధి, సౌకర్యాలు కల్పించడం, జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేపట్టారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. కె రమేష్, ఉపాధ్యాయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.