భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమిలి రూరల్ మండల సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు పాల్గొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సూచనలతో రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు ఆదేశాలనుసారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం నుండి ఇచ్చినటువంటి కార్యక్రమం హౌస్ మ్యాపింగ్ మరియు ఓటర్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఒక ఇంటి నెంబర్ పై అత్యధికంగా 350 పైచిలుకు ఓటర్లు ఉండడం అనేది అసాధ్యమైన పని కనుక నాయకులు తమ తమ పరిధిలో ఓటర్ లిస్టును పట్టుకొని ఆ డోర్ నెంబర్ లో నివసిస్తున్న వారిని ఓటర్ లిస్టు తో సరి పోల్చి తప్పుడు ఓటర్లను గుర్తించి రానున్న ఎన్నికల్లో తప్పుడు ఓట్లు పోలవ్వకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిపై ఉంది అని తెలియజేస్తూ మొన్న రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలందరికీ తెలియజేసి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను ఏ రకంగా మోసం చేస్తుందో వివరించి రానున్న రోజుల్లో చంద్రన్న పాలనలో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే పథకాలు యొక్క గొప్పతనం కింద స్థాయి నుండి ఎంత ఉపయోగపడుతుందో తెలియజేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఎక్స్ జెడ్పిటిసి సరగడ అప్పారావు భీమిలి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు కంటుబుక్తా ప్రకాష్ నగరపాలెం రాము రామ లక్ష్మణ్ చిప్పాడ ఎంపీటీసీ శివాజీ మండల యూనిట్ ఇన్చార్జిలు బూత్ కమిటీ సభ్యులు మండల ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది.