ప్రశాంత నగరానికి, పరిశుభమైన పట్టణానికి, మంచికి మానవత్వానికి ఆదర్శనీయమైన విశాఖపట్నం రౌడీయిజం, గ్యాంగస్టర్లకు అడ్డాగా మారనుందా అనే అనుమానం వ్యక్తమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. దేశంలో సుందరీకరణ పట్టణాలలో విశాఖపట్నం ఒకటినీ అన్నారు. ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులని అన్నారు. ప్రశాంతతకు మారుపేరు ఈ విశాఖ నగరమని చెప్పారు. అలాంటి నగరం నేడు నేర చరిత్ర, అపహారణ, స్మగ్లిoగ్, మత్తు పదార్ధాల కేంద్రంగా మారి నగరం యొక్క పరువు తీస్తున్నారని అన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి దారుణాలు మరీ ఎక్కువయ్యాయని అన్నారు. సాక్ష్యాత్ విశాఖ పార్లమెంట్ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి బెదిరించే స్థాయికి ప్రశాంత విశాఖను తీసుకొని వచ్చారంటే ఎంత దారుణమని అన్నారు. పార్లమెంట్ సభ్యుని యొక్క కుటుంబానికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రౌడీలు, గుండాలు పెచ్చురేగిపోతున్నారని చెప్పారు. గంజాయి లాంటి అతి ప్రమాదకరమైన మత్తు పదార్ధాలు విశాఖ కేంద్రంగా సప్లై అవుతుందని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయంటే ఎంతవరకు ఈ నగరం యొక్క పరువుతీస్తున్నారో అర్ధం అవుతుందని అన్నారు. అమరావతి పరిపాలనా రాజధాని అని చెప్పిన తరువాత ఇలాంటి అఘాయిత్యాలు, దారుణాలు మరీ ఎక్కువ అయ్యాయని అన్నారు. గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా విశాఖ నగరాన్ని మార్చేవిధంగా కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గంటా నూకరాజు కోరారు. భూ కబ్జా దారులు, గంజాయి ముఠా దారులు, రౌడీలు, గూండాల నుండి మన జిల్లాను కాపాడుకోవాలని అన్నారు.