సాధారణంగా అత్తాకోడళ్లు చిన్న విషయాలపై వాదించుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, ఓ కోడలు తన అత్త తలను మెట్లకేసి కొట్టిన ఘటన యూపీలోని బిజ్నోర్ లో జరిగింది. అత్త, కోడలు మధ్య చిన్న విషయంలో వాగ్వాదం తలెత్తింది. దీంతో కోడలు తీవ్ర ఆగ్రహంతో అత్తపై కర్రతో దాడి చేసింది. అనంతరం అత్త తలను మెట్లకేసి కొట్టింది. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.