జగన పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని నారా లోకేశ్ విమర్శించారు. గతేడాది 47లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తే ఈ ఏడాది 43 లక్షల మందికే ఇచ్చారంటే.. 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆ లెక్కే చెబుతోందన్నారు. రాష్ట్రంలో కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదే కానీ కరెంటు బిల్లు పట్టుకుంటే మాత్రం షాక్‌తో విలవిల్లాడిపోవాల్సిందేనని అన్నారు. ఎన్నికల ముందు కరెంటు చార్జీలు తగ్గిస్తానని ప్రకటించిన జగన ఇప్పుడు నెలకొకసారి పెంచుతున్నాడన్నారు. అందుకే.. వైసీపీ ఫ్యాను ఇక కట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పది నెలలు ఓపిక పడితే టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మహిళలకు న్యాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.