సీఎం జగన్మో హన్‌రెడ్డి చేస్తున్న మోసాలను బీజేపీ కార్యకర్త లు ఇంటింటికి తీసుకెళ్ళాలని ఆ పార్టీ ఒంగోలు జిల్లా అ ద్యక్షుడు పీవీ.శివారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంతపేటలోని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్లు ఇస్తున్నా ఆ నిధులను పక్కదారి పట్టిస్తు న్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇచ్చిన నిధులపై కరపత్రాల రూపంలో ఈనెల 20నుంచి నిర్వహించే ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలన్నారు. న రేంద్రమోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనపై ఈ నెల 25న ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు శివారెడ్డి తెలిపారు. నియోజకవ ర్గ ఇన్‌చార్జి యోగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ అరాచకపాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై తమ అగ్రనేతలు అమీత్‌షా, నడ్డాలు మాట్లాడితే వైసీపీ నేతలు విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి నెలకు రెండు సార్లు మోదీ, అమీత్‌షాను, ఇతర కేంద్ర మంత్రులను కలిస్తే తప్పులేదు కానీ, 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజానీకం వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 2.76 లక్షల కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను దుర్వినియోగం చేశారని ఆరో పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో నాయకులు పీవీ.కృష్ణారెడ్డి, శెగ్గం శ్రీనివాసులు, రాయపాటి అజయ్, తానికొండ సురేష్, కె.సుధాకర్, అల్లరి రామ్య, మధు, గుర్రం సత్యనారాయణ, రాజేష్ వర్మ, రవి, సంజీవకుమార్, సత్యవతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.