సందర్భం వచ్చినప్పుడల్లా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు అంటూ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ‘‘దేశ జీడీపీ ఏటా 10 పది శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో, కేవలం పదేళ్లలోనే నిరుద్యోగిత, పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏం చేయాలో తెలియదు. ఇక ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు..అందుకే ఇలా..’’ అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.