ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమీపిస్తున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రయాదవ్ కొత్త పార్టీని స్థాపించనున్నారు. జూలై 23న పార్టీ పేరును ప్రకటిస్తారు. జులై 23న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రజాసింహగర్జన సభ పేరుతో పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ మేరకు రామచంద్రయాదవ్ వివరాలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఏపీలో తన కొత్త పార్టీ కొత్తదనం తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకుంటున్నారని, వైసీపీ గద్దెనెక్కాక సాగునీటి ప్రాజెక్టుల్లోనే రూ.30 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.