ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే ... దేశ విభజన జరిగేది కాదు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 18, 2023, 10:20 PM

దేశ విభజనపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవిభజన నాటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని అజిత్ దోభాల్ అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో నేతాజీ సంస్మరణార్థం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేతాజీ తన జీవితంలో అనేక సందర్భాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు. ‘‘నేను ఇక్కడ మంచి చెడుల గురించి మాట్లాడట్లేదు. కానీ, భారత్‌తో పాటూ ప్రపంచ చరిత్రలో పరిస్థితులకు ఎదురీదిన వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మహాత్మా గాంధీని సైతం ప్రశ్నించగలిగిన ధైర్యసాహసాలు ఆయన సొంతం. ‘నేను బ్రిటీష్ వారితో పోరాడుతా, స్వాతంత్ర్యం కోసం అడుక్కోను. స్వాతంత్ర్యం నా హక్కు, అది నేను సాధించి తీరుతా’ అని నేతాజీ అనుకునేవారు. నేతాజీ జీవించి ఉంటే దేశవిభజన జరిగి ఉండేది కాదు. తాను మెచ్చిన ఒకే ఒక నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని జిన్నా అప్పట్లో అన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. .నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. తైవాన్‌లో విమానం కూలి ఆయన మరణించారనేది అనేక మంది అభిప్రాయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com