బీజేపీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన కుష్బూపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమ శిక్షణను ఉల్లంఘించినందుకు గాను డీఎంకే పార్టీ శివాజీ కృష్ణమూర్తి ప్రాథమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే ఆయనను అన్ని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.