ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 12 నుండి 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మరో వారం రోజులు ఒంటిపూట బడులు పొడిగించారు. దీంతో ఈనెల 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉ. 7.30 నుండి 11.30 వరకు పాఠాలు బోధించనుండగా, ఉ. 8.30 నుండి 9 వరకు రాగిజావ, ఉ. 11.30 నుండి 12 వరకు మధ్యాహ్న భోజనం పెడతారు.