తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చెన్నై పట్టణంలోని అరుంబాక్కం శ్రీశక్తినగర్లో వరద నీరు ఒకే చోట చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు, స్థానికులు ఆ నీటిలో నుంచే ప్రయాణం కొనసాగిస్తున్నారు.