నేపాల్లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటివరకు 5 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. హేవా నది ఉధృత రూపం దాల్చడంతో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వద్ద పని చేస్తున్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.