ఆధునిక ఔషధాలు అందుబాటులో లేకపోతే అప్పుడే చనిపోయే వాడ్ని అని ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ అన్నారు. మలేరియాతో కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు క్లోరోక్విన్, డాక్సీ సైక్లైన్ వంటి ఆధునిక ఔషధాలను తీసుకున్నానని, అప్పుడే ఆ వ్యాధి నుంచి బయటపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మెడిసిన్స్ వల్ల కలిగే ప్రభావాల గురించి ప్రశ్నిస్తూనే ఉండాలన్నారు.