మండపేట పట్టణంలో ఆదిత్య జూనియర్ కాలేజ్ విద్యార్థినిలకు పట్టణ పోలీసులు దిశా యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దిశ విభాగం డిఎస్పి ఎస్ మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దిశా యాప్ మహిళల పాలిట రక్షణ కవచమని, దీనిని వినియోగించడం ద్వారా ఆపద సమయంలో పోలీసులు తక్షణం మీ ముందుకు చేరతారని అన్నారు. ఈ సందర్భంగా దిశా యాప్ వినియోగాన్ని, మహిళల భద్రతలపై సూచనలు చేసి విద్యార్థినీల మొబైల్ ఫోన్లలో దిశా యాప్ ను ఇన్స్టాల్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్, మండపేట రూరల్ సిఐ శివ గణేష్, ఎస్సై ఎం అశోక్, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైమ్ సిఐ గోవిందరాజు, దిశ ఉమెన్ ఎస్సై కనక దుర్గ, సిబ్బంది, మండపేట మహిళ పోలీస్ లు పాల్గొన్నారు.