ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' అనే పొలిటికల్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో రామ్ గోపాల్ వర్మ సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్తో గంటకు పైగా భేటీ అయ్యారు. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే సీఎం జగన్ తో రామ్ గోపాల్ వర్మ మాట్లాడినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.