జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పవన్ కళ్యాణ్ ప్రాణహాని అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాణహాని ఉంటే పవన్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అమ్మవారి పేరుతో ఉన్న వారాహి వాహనంపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.ఈయనకు ప్రాణహాని ఉందట... ఈయన ఇంటి వద్ద రెక్కీ కూడా చేశారట. అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? నీ వల్ల ఎవడికీ లాభం కానీ, నష్టం కానీ లేవు. నీ బతుకు నువు బతుకుతున్నావు... రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యావు అని అన్నారు. రెండు చోట్ల ఓడిపోయావు..గుర్తుపెట్టుకో..మళ్లీ ఓడిపోతావు అని అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.