ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు జాతీయ జల అవార్డులు దక్కాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి చేతుల మీదుగా ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు, అధికారులను సీఎం జగన్ అభినందించారు.