జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సినిమా రంగంలో పవన్ కల్యాణ్ చిట్టా అంతా తనవద్ద ఉందని, బాగుండదని చెప్పడంలేదని అన్నారు. తాను కూడా సినిమా రంగానికి చెందినవాడినని, ఫిల్మ్ ఎగ్జిబిటర్ అని ద్వారంపూడి వెల్లడించారు. తమకు సినిమా హాళ్లు ఉన్నాయని, తమ థియేటర్ కాంప్లెక్స్ లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సినిమాలే ఎక్కువగా ఆడాయని వివరించారు. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియకపోవచ్చని... అల్లు అరవింద్‌కు బాగా తెలుసని ద్వారంపూడి పేర్కొన్నారు. పవన్ కి నా గురించి తెలియకపోవచ్చు కానీ.. అతని గురించి నాకు బాగా తెలుసు. నాకు కూడా సినిమా ఫీల్డ్‌లో చాలా మంది ఉన్నారు. త్వరలోనే అతని చిట్టా విప్పుతాను అని కీలక వ్యాఖ్యలు చేసారు.