ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనిచేయని నేతలకు పార్టీలో స్థానం లేదు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 08:39 PM

తెలుగుదేశం పార్టీ నేత అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పనిచేయని నేతలకు పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.. పని చేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటాం’ అని తెలిపారు. పని చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటా.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉండాలి.. గెలుపు కోసం అందరూ కృషి చేయాలని.. చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని నేతలకు చంద్రబాబు  తెలిపారు.


 


 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com