మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల భవనాలను మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్రమంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విఫ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, కలెక్టర్ శివశంకర్ హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు.