మేడికొండూరు మండలం పరిధిలోని పేరేచర్ల గ్రామ సమీపంలో ఉన్న ఇంటెల్ పబ్లిక్ స్కూల్ నందు మంగళవారం సేవ్ వాటర్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నెహ్రూ యువ కేంద్రం సంఘటన్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటెల్ స్కూల్ డైరెక్టర్ అయినా కే. జయ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు నీటిని ఏ విధంగా వాడుకోవాలి నీటి యొక్క విలువను గురించి క్షుణ్ణంగా పిల్లలకు , తల్లిదండ్రులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో అనేక మారుమూల గ్రామాలకు మంచినీటి కొరత ఎంతో ఉందని ఎంతో దూరం నుండి వేయా ప్రయాసలు కూర్చి నీటిని తీసుకుని వస్తున్నారని ఆయన అన్నారు.