ఒడిశా నౌపడాలోని లక్ష్మీ నారాయణ అనే రైతు, అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ.2.50 లక్షలు పలికే మామిడి పండ్ల చెట్లను పెంచుతున్నాడు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో ఫోటోలు పెట్టి పంచుకున్నాడు. అయితే, ఇలా షేర్ చేసిన ఒక్కరోజులోనే అతడి తోటలోని 4 మామిడి పండ్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన తర్వాత రైతులు పండించే విలువైన ఉత్పత్తుల రక్షణపై ఆందోళన మొదలైంది.