తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరిలో సోమవారం జరిగినభవిష్యత్తు కు గ్యారెంటీ చైతన్య రథం వాహనాల ప్రారంభోత్సవకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీనాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ , పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగ జగదీష్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీపాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారని చెప్పారు.