అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో వేంచేసియున్న సుభద్రా బలబద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి తొలి రధ యాత్ర మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు గవరపాలెంలో గల స్వామి వారి ఆలయం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాద్, పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి గారు, వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ మరియు వైసిపి నాయకులు దాడి జైవీర్ , 81వ కార్పొరేటర్ లక్ష్మీ సౌజన్య రాంబాబు , 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ అతిథులుగా పాల్గొననున్నారు. ముందుగా శ్రీ జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రధ యాత్ర ఉత్సవాన్ని ప్రారంభిస్తారనీ నిర్వాహకులు తెలిపారు.