అనకాపల్లి పట్టణం అందంగా తీర్చిదిద్దడంతో పాటు, చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నడుం బిగించారు. జివిఎంసి కమిషనర్ సాయి కాంత్ వర్మ, మంత్రి అమర్నాథ్ జీవీఎంసీ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. పట్టణం అందంగా ఉండడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని డివైడర్ల నిర్మాణం సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.