జాతీయ రహదారి అగనంపూడి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మింది గ్రామానికి చెందిన జి లౌక్య సాయి ప్రసన్న (35) మృతి చెందింది. సంఘటనా స్థలానికి దువ్వాడ పోలీసులు చేరుకుని తెలిపిన వివరాల మేరకు.. అగనంపూడి అస్పటల్ నుంచి ఇంటికి తిరిగి వెల్తున్న క్రమంలో అదే దారిలో వెళ్తున్న లారీ ఆమెను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అగనంపూడి అస్పటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో మెరుగైన వైద్య నిమిత్తం కిమ్స్ ఐకాన్ హస్పటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని తెలిపారు. ఆమెకు (9) సంవత్సరాలు పాప, భర్త రవికుమార్ షిప్ యార్డ్ లో కాంట్రాక్ట్ లేబర్ గా వర్క్ చేస్తున్నాడని అన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.