‘‘ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దిశ యాప్, చట్టాల ప్రభావం ఏమీ కనిపించడం లేదు’’ అని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. ‘‘బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ హత్య ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ అకృత్యాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.