చిత్తూరు జిల్లాలో ఈనెల 26 నుంచి జూలై 16వ తేదీ వరకు కుష్ఠువ్యాధిగ్రస్తులను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించాలని కలెక్టర్ షన్మోహన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో దీనికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. తొలిదశలోనే బహుళ ఔషధ చికిత్స అందించి వ్యాధి సోకకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో రాజశేఖర్ రెడ్డి, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయవ్యాధి అధికారి రెడ్డెప్ప, డీపీఎంవో హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.